jeevan kiran

jeevan kiran

LIC Jeevan Kiran Policy:

టర్మ్ప్లాన్స్లో ఇది ప్రత్యేకం - లైఫ్కవర్తో పాటు ప్రీమియం రిటర్న్కూడా ఉంటుంది

ప్రీమియం మొత్తాన్ని సింగిల్‌ పేమెంట్‌ లేదా రెగ్యులర్‌ పేమెంట్స్‌లో ఎలాగైనా చెల్లించవచ్చు.

 

 

 దేశంలో అతి పెద్ద లైఫ్ఇన్సూరెన్స్కంపెనీ అయిన లైఫ్ఇన్సూరెన్స్కార్పొరేషన్‌, 'ఎల్ఐసీ జీవన్ కిరణ్' పేరిట కొత్త టర్మ్పాలసీని ప్రారంభించింది. ఇది నాన్-లింక్డ్, నాన్ పార్టిసిటింగ్ ఇండివిడ్యువల్సేవింగ్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్

పాలసీ జరుగుతున్న సమయంలో పాలసీహోల్డర్‌ అకస్మాత్తుగా మరణిస్తే, కుటుంబానికి ఆర్థిక సాయం అందుతుంది. అదృష్టవశాత్తు ఏమీ జరక్కపోతే, మెచ్యూరిటీ పూర్తయ్యాక, అప్పటి వరకు కట్టిన ప్రీమియం మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. సాధారణంగా, టర్మ్‌ పాలసీల్లో ప్రీమియం డబ్బులను బీమా కంపెనీలు వెనక్కు ఇవ్వవు. పాలసీలో మాత్రం పాలసీహోల్డర్‌ డబ్బును ఎల్‌ఐసీ తిరిగి ఇస్తుంది. మెచ్యూరిటీ తేదీ తర్వాత, జీవిత బీమా కవరేజ్ తక్షణం రద్దవుతుంది.

పొగ తాగే అలవాటున్న, పొగ తాగని వాళ్ల కోసం ప్లాన్‌లో వేర్వేరు ప్రీమియం రేట్లు ఉన్నాయి. ప్రీమియం మొత్తాన్ని సింగిల్‌ పేమెంట్‌ లేదా రెగ్యులర్‌ పేమెంట్స్‌లో ఎలాగైనా చెల్లించవచ్చు.

మెచ్యూరిటీ బెనిఫిట్స్
పాలసీ అమల్లో ఉన్నప్పుడు, LICకి అందిన మొత్తం ప్రీమియంలను (అదనపు ప్రీమియం, రైడర్ ప్రీమియం, పన్నులు వంటివి తీసేసి) "మెచ్యూరిటీపై లభించే హామీ మొత్తం"గా (Sum Assured on Maturity) నిర్ణయిస్తారు.

(1) రెగ్యులర్‌ పద్ధతిలో (ఇన్‌స్టాల్‌మెంట్స్‌ రూపంలో) ప్రీమియం చెల్లించిన వారికి:
పాలసీ వ్యవధిలో పాలసీహోల్డర్‌ మరణిస్తే, ప్రాథమిక హమీ మొత్తం (Basic Sum Assured) లేదా వార్షిక ప్రీమియానికి ఏడు రెట్ల మొత్తం లేదా అప్పటి వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో 105 శాతం, ఏది ఎక్కువైతే దానిని పాలసీహోల్డర్‌ కుటుంబానికి చెల్లిస్తారు. దీనిని "మరణంపై హామీ మొత్తం"గా (Sum Assured on Death) పిలుస్తారు.

(2) సింగిల్ ప్రీమియం చెల్లించిన వారి విషయంలోమరణంపై హామీ మొత్తం”:
సింగిల్ ప్రీమియంలో 125% లేదా ప్రాథమిక హామీ మొత్తంలో ఏది ఎక్కువైతే దానిని చెల్లిస్తారు. ప్లాన్‌ ప్రారంభమైన మొదటి సంవత్సరంలో ఆత్మహత్య మినహా అన్ని రకాల మరణాలు పాలసీ కవరేజ్‌లోకి వస్తాయి. రెండో సంవత్సరం నుంచి, ఆత్మహత్యలు కూడా కవరేజ్‌లో ఉంటాయి.

డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్
1. డెత్‌ బెనిఫిట్‌ కింద లభించే మొత్తం డబ్బును ఏకమొత్తంగా నామినీకి చెల్లిస్తారు.
2.
ఇన్‌స్టాల్‌మెంట్స్‌ పద్ధతిలోనూ డబ్బు తీసుకోవచ్చు. యాక్టివ్ ఇన్సూరెన్స్ కింద, డెత్ బెనిఫిట్‌ను ఒకేసారి కాకుండా ఐదు సమాన వాయిదాల్లో పొందే ఆప్షన్‌ కూడా ఉంది. ఏడాదికి, ఆరు నెలలకు, మూడు నెలలకు, ప్రతి నెలా వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు.

LIC జీవన్ కిరణ్ పాలసీ వివరాలు
పాలసీలో కనీస ప్రాథమిక హామీ మొత్తంగా రూ. 15 లక్షలు లభిస్తాయి. గరిష్ట ప్రాథమిక హామీ మొత్తానికి పరిమితి లేదు. గృహిణులు, గర్భిణులు ప్లాన్ తీసుకోవడానికి అనుమతించరు. డెలివెరీ అయిన ఆరు నెలల తర్వాత ప్లాన్‌ కోసం అప్లై చేసుకోవచ్చు. కొవిడ్-19 టీకాలను పూర్తి స్థాయిలో తీసుకోకపోతే, పాలసీ షరతులు పెరుగుతాయి. పాలసీ కనిష్ట వ్యవధి 10 సంవత్సరాలు, గరిష్ట వ్యవధి 40 సంవత్సరాలు.

ప్రీమియం చెల్లింపులు
ప్రీమియంలను సంవత్సరానికి ఒకసారి లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా సింగిల్ ప్రీమియంలో చెల్లించవచ్చు. నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, అమెక్స్ కార్డ్, UPI, IMPS, -వాలెట్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చు.

 

Share :

Add New Comment

 Your Comment has been sent successfully. Thank you!   Refresh
Error: Please try again

Order form

 Your Order has been sent successfully. We will contact you as soon as possible.
Error: Please try again