New Jeevan Anandh
 
                                    
LIC Jeevan Anand In Telugu
.అసలు జీవన్ ఆనంద్ పాలసీ అంటే ఏమిటి? (What Is LIC Jeevan Anand Policy? )
LIC Jeevan Anand In Telugu జీవన్ ఆనంద్ ఒక హోల్ లైఫ్ ఎండోమెంట్ & నాన్ లింక్డ్ పాలసీ ( Whole Life Endowment &Non Linked ).
జీవన్ ఆనంద్ ఈ ఒక్క పాలసీ ద్వారానే మీకు 17 లక్షల మెట్యూరిటీ తోపాటు జీవితాంతం పూర్తి ఉచిత ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది.
అలాగే ఇది ఒక నాన్ లింక్డ్ అంటే ఈ పాలసీలో మీరు చెల్లించే ప్రీమియం డబ్బులను LIC సంస్థ షేర్ మర్కెట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యదు కాబట్టి మీ డబ్బులు ఈ పాలసీలో భద్రంగా ఉంటాయి.
• జీవన్ ఆనంద్ పాలసీ ఎలా పనిచేస్తుంది? (How does Jeevan Anand Policy Work? )
ఈ పాలసీలో మీకు పాలసీ పీరియడ్ తర్వాత బోనస్ తో కలిపి మెట్యూరిటీ డబ్బులు లభిస్తాయి, పాలసీ మధ్యలో పాలసీదారుడు ఏ కారణంగా మరణించినా నోమినికి డెత్ బెనిఫిట్ అందివ్వడం జరుగుతుంది. పాలసీ మెట్యూర్ అయిన తరువాత నుంచి పాలసీ దారుడు ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే ప్రారంభంలో తీసుకున్న భీమా, జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్ ని అందిస్తుంది. 100 సంవత్సరాల లోపు పాలసీదారుడు ఏ కారణంగా మరణించినా సరే మొత్తం భీమా అమౌంట్ నామినీకి అందిస్తారు.
• పాలసీ లో ఉన్న అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటి? ( Key Features Of LIC Jeevan Anand Telugu )
1. ఈ ఒక్క పాలసీ ద్వారానే పాలసీ దారునికి జీవితాంతం ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
2. మెట్యూరుటి మరియు మరణ ప్రయోజనాలు లభిస్తాయి.
3.పాలసీదారునికి రెగ్యులర్ ప్రీమియం(Regular Premium Payment ) చెల్లించే అవకాశం ఉంటుంది.
4. ఈ పాలసీలో మీకు బోనస్ వెస్టెడ్ సింపుల్ రెవేసినరీ బోనస్ + ఫైనల్ అడిషనల్ బోనస్ ( Vested Simple Reversionary Bonus + Final Additional Bonus ) రూపంలో LIC సంస్థ అందిస్తుంది.
5. ఈ పాలసీలో మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై సంవత్సరానికి ఒకసారి లక్షా 50 వేల వరకూ ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉంటుంది. పాలసీ చివర్లో లభించే మెట్యూరిటి అమోంట్ పై కూడా ఎటువంటి టాక్స్ విధించబడదు.
6. జీవన్ ఆనంద్ పాలసీలో అతితక్కువ ప్రీమియం కి 3 బెనిఫిట్ రైడర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి
• ఆక్సిడెంట్ డెత్ మరియు డిజాబిలిటీ బెనిఫిట్ రైడర్
• టర్మ్ బెనిఫిట్ రైడర్
• క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్
వీటి వల్ల లభించే ప్రయోజనాలు మనం ముందు ఉదాహరణలో తెలుసుకొందాం.
• LIC జీవన్ ఆనంద్ పాలసీలో ప్రస్తుతం మనకి ఎంత బోనస్ లభిస్తుంది? (New Bonus Rates Of LIC Jeevan Anand?)
LIC బోనస్ రేట్స్ ని సంవత్సరానికి ఒకసారి ప్రతీ ఆర్థిక సంవత్సరంలో పాలసీదారులకు అందిస్తుంది.
బోనస్ రేట్స్ వేరు వేరు పాలసీలకు వేరే వేరు గా లభిస్తాయి మరియు లభించే బోనస్ పాలసీ సమయం పై ఆధారపడి ఉంటాయి.
పాలసీ సమయం బోనస్ ( 2020 – 2021)
11 నుంచి 15 సం||ల మధ్య – 37 లేదా 38/1000
16 నుంచి 20 సం||ల మధ్య – 42 లేదా 43/1000
20 సంవత్సరాలు పైబడి – 45 లేదా 46/1000
ఇక్కడ బోనస్ ప్రతీ 1000 రూపాయలు కి లభిస్తుంది, అంటే లక్ష రూపాయల పాలసీని 20 సంవత్సరాలకు తీసుకొంటే 1,00,000 ÷ 1000 × 45 = 4500/-.
ఈ సంవత్సర బోనస్ గా మీకు లభిస్తుంది.
• LIC జీవన్ ఆనంద్ పాలసీని తీసుకోవడానికి అర్హులు ఎవరు? ( Who can take the Policy? )
ఈ పాలసీ తీసుకొనే వ్యక్తి యొక్క కనీస వయస్సు( Minimum Age ) =18 సంవత్సరాలు.
అత్యధిక వయస్సు (maximum Age ) = 50 సంవత్సరాలు.
కనుక 18 నుంచి 50 సంవత్సరాల వయసు మధ్యకలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.
• ఈ పాలసీని ఎన్ని సంవత్సరాలకు తీసుకొనే వీలుంటుంది? ( Policy Term Of LIC Jeevan Anand ? )
కనీస పాలసీ సమయం వచ్చి (Minimum Policy Period ) = 15 సంవత్సరాలు.
అత్యధిక పాలసీ సమయం ( Maximum Policy Period ) = 35 సంవత్సరాలు.
కాబట్టి మీరు ఈ పాలసీ యొక్క సమయాన్ని 15 నుంచి 35 సంవత్సరాల మధ్య నిర్ణయించుకోవచ్చు.
• జీవన్ ఆనంద్ పాలసీ యొక్క కనీస మరియు అత్యధిక భీమా పరిమితి ఎంత? ( How Much Sum Assured Of Jeevan Anand?
ఈ పాలసీ యొక్క కనీస భీమా పరిమితి = Rs 1, 00, 000/- రూపాయలు.
అత్యధిక భీమా పరిమితి కి ఎటువంటి అవధి లేదు = NO Limit
కనీసం లక్ష రూపాయలు నుంచి అత్యధికముగా ఎంతైనా భీమాని తీసుకోవచ్చు, కానీ ఇది మీయొక్క వార్షిక ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.
రోజుకి 53/- రూపాయలతో 12 లక్షలు పొందండి, పూర్తి వివరాలు.
జీవన్ ఆనంద్ పాలసీ యొక్క గరిష్ట మెట్యూరిటీ సమయం ఎంత?
ఈ పాలసీయొక్క అత్యధిక మెట్యూరిటీ కాల పరిమితి = 75 సంవత్సరాలు గా ఉంటుంది.
అంటే ఈ పాలసీని మనం అత్యధికంగా మనకి 75 సంవత్సరాలు వచ్చే వరకూ మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, కాని 50 సంవత్సరాల ఒక వ్యక్తికి ఈ పాలసీ 25 సంవత్సరాలు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే పాలాసియొక్క గరిష్ట మెట్యూరిటీ 75 సంవత్సరాలు కాబట్టి.
పాలసీ మధ్యలో అప్పటివరకు మనం చెల్లించిన ప్రీమియంపై లోన్ లభిస్తుందా? లేదా? ( Loan Facility )
జీవన్ ఆనంద్ పాలసీలో పాలసీదారుడు కనీసం 2 సంవత్సరాలు ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తి ప్రీమియం చెల్లిస్తే , అత్యవసర పరిస్థితుల్లో జమా చేసిన ప్రీమియం పై లోన్ కూడా పొందవచ్చు.
అది ఎంత అంటే మీయొక్క సరెండర్ వేల్యూకి 90% గా లోన్ లభిస్తుంది. లోన్ పై వడ్డీరేటును LIC సంస్థ నిర్ణయిస్తుంది. బ్యాంకు కంటే తక్కువ వడ్డీ ఈ లోన్ పై అందుబాటులో ఉండవచ్చు.
ఈ పాలసీలో 4 రకాలుగా ప్రీమియం చెల్లించే అవకాశం ఉంటుంది.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly
3. 3 నెలలకు ఒకసారి – Quarterly
4. ప్రతినెలా – Monthly
ఈ విధంగా పాలసీదారుడు ఏదో ఒక పద్దతిలో నిర్ణయించుకొన్న మోడ్ ఆధారంగా ప్రీమియం చెల్లించవచ్చు.
1. సంవత్సరానికి ఒకసారి – Yearly = 2%
2. 6 నెలలకు ఒకసారి – Half Yearly = 1%
3. 3 నెలలకు ఒకసారి – Quarterly =Nil
ఇక్కడ రిబేట్ అంటే మీరు చెల్లించే ప్రీమియం అమౌంట్ పై కొద్దిగ డిస్కౌంట్ రూపంలో తగ్గించడం జరుగుతుంది. ఈ పాలసీలో సంవత్సరానికి మరియు 6 నెలలకు ఒకసారి ప్రీమియం చెల్లించేవారికి ఈ రిబేట్ లభిస్తుంది.
జీవన్ ఆనంద్ పాలసీలో ఎంత భీమాకి మెట్యూరిటీ ఎంత లభిస్తుంది? ఒకవేళ పాలసీదారుడు పాలసీ మధ్యలో ఏ కారణంచేత మరణించినా నామినీ కి ఎటువంటి ప్రయోజనాలు LIC సంస్థ అందిస్తుందన్న విషయాన్నీ ఒక సరళమైన ఉదాహరణ ద్వారా తెలుసుకొందాం ! –
ముఖ్య గమనిక :-
1. ఈ పాలసీలో పాలసీదారుడు పాలసీ తీసుకొన్న 3 సంవత్సరాలలోపు ఏ కారణంగా మరణించినా అప్పటివరకు చెల్లించిన ప్రీమియం కి 7 రెట్లు అమౌంట్ మాత్రమే మరణ ప్రయోజనం గా నామినీకి లభిస్తుంది.
2. ఒకవేళ పాలసీదారుడు పాలసీ తీసుకొన్న 3 సంవత్సరాల తర్వాత ఏ కారణంగా మరణించినా అప్పుడు ప్రాథమిక భీమాకి 125% + అప్పటివరకు అతనికి లభించే బోనస్ గా LIC సంస్థ అందిస్తుంది.
• జీవన్ ఆనంద్ పాలసీలో లభించే టాక్స్ ప్రయోజనాలు ఏమిటి? ( LIC Jeevan Anand Tax Benefits?)
ఈ పాలసీలో పాలసీదారుడు చెల్లించే ప్రీమియంపై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 80c వర్తిస్తుంది, కాబట్టి ప్రతీ సంవత్సరo Rs 1,50,000/- వరకూ టాక్స్ డేడిక్షన్ పొందవచ్చు.
అదేవిధంగా జీవన్ ఆనంద్ పాలసీలో లభించే మెట్యూరిటీ మరియు మరణ ప్రయోజనాల పై ఇన్కమ్ టాక్స్ రూల్ అండర్ సెక్షన్ 10D వర్తిస్తుంది.
కాబట్టి ఎటువంటి టాక్స్ విధించబడదు. మొత్తం అమౌంట్ టాక్స్ రహితంగా పాలసీదారునికి లభిస్తుంది.
ఈ రైడర్ తీసుకొన్న పాలసీదారుడు ఆక్సిడెంట్ కారణంగా మరణిస్తే ప్రాథమిక భీమాకి లభించే మరణ ప్రయోజనం తోపాటు అందనంగా , మరికొంత అత్యధిక ప్రయోజనం నామినికి లభించడం జరుగుతుంది.ఇది మొదటి ప్రయోజనం.
పాలసీదారునికి ఆక్సిడెంట్ జరిగింది కానీ ఆక్సిడెంట్ లో మరణించలేదు, డిజాబిలిటీ కి గురయ్యాడు అంటే ఆక్సిడెంట్ లో ప్రాథమిక అవయవాలు కోల్పోయి ఏ పనిచేయలేని స్థితిలో ఉన్నట్లయితే వెంటనే పాలసీకి సంబందించిన భవిష్యత్తు ప్రీమియంస్ అన్ని మాఫీ చెయ్యడం జరుగుతుంది,అప్పట్నుంచి మొత్తం ప్రీమియంని LIC సంస్థే చెల్లిస్తుంది.
దీనితోపాటుగా ఈ రైడర్ ద్వారా లభించే మొత్తం ప్రయోజనాన్ని పాలసీదారునికి ప్రతినెలా రెగ్యులర్ సహాయం రూపంలో 10 సంవత్సరాలపాటు అందివ్వడం జరుగుతుంది.
ముఖ్య గమనిక : ఈ ప్రయోజనం కొరకు ఆక్సిడెంట్ జరిగిన 180 రోజులు లోపు మీరు సంస్థకి సమాచారాన్ని అందివ్వాల్సివుంటుంది.
టర్మ్ రైడర్ ( Term Rider – UIN 512B210V01)
ఇది ఒక టర్మ్ పాలసీలా పనిచేస్తుంది. ఈ రైడర్ పాలసీ తీసుకొనే సమయంలో మాత్రమే తీసుకొనే సదుపాయం ఉంటుంది, మధ్యలో లభించదు.
టర్మ్ రైడర్ ముఖ్య ప్రయోజనం ఏమిటి ?
పాలసీదారుడు పాలసీ సమయంలో ఏ కారణంగా మరణించినా అంటే సాధారణంగా గాని లేదా ఆక్సిడెంట్ కారణంగా కానీ మరణిస్తే తీసుకొన్న భీమాకి సమానమైన అమౌంట్ నామినీకి అదనంగా లభిస్తుంది.
అంటే Rs 6,25,000 + Rs 5,00,000 = Rs 11,25,000 నామినికి మరణ ప్రయోజనంగా లభిస్తుంది.
3. కొత్త క్రిటికల్ ఇల్లన్స్ బెనిఫిట్ రైడర్ ( Critical Illness Benefit Rider – UIN 512A212V01)
ఈ రైడర్ మీకు పాలసీ సమయంలో ఆరోగ్య భీమా ప్రయోజనం కలిగిస్తుంది.
అంటే పాలసీదారుడు ఏదైనా పెద్ద అనారోగ్యానికి గురిఅయినట్లైతే ( కాన్సర్, హార్ట్ అట్టాక్, కిడ్నీ ఫెయిల్యూర్, బ్రెయిన్ సంబంధిత మొదలైనవి ) ట్రీట్మెంట్ కి కావాల్సిన మొత్తం ఖర్చును LIC సంస్థ అందిస్తుంది.
ముఖ్య గమనిక :-
ఈ సమయంలో మీరు అదనపు పెనాల్టీని సంస్థకి చెల్లించవలసిన అవసరం ఉండదు.
ఈ గ్రేస్ పీరియడ్ సమయంలో కూడా మీకు ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
 
                    
                
Add New Comment