JEEVAN UMANG
jeevan Umang
ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ మీకు పొదుపు మరియు రిస్క్ కవర్ అందించే పాలసిగా ఉంది అని చెప్పవచ్చు. ఎల్ఐసి జీవన్ ఉమంగ్ పాలసీ ఎల్ఐసి యొక్క ఉత్తమ పాలసీల్లో ఒకటిగా ఉంది. ఈ పాలసీ పెన్షన్ కావాలి అని అనుకునే వారికీ ఒక మంచి పాలసీ అని చెప్పవచ్చు .
పాలసీ తీసుకోవడానికి వయస్సు: కనీస వయస్సు 90 రోజులు పూర్తి కావాలి, గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు.
పాలసీ టర్మ్: కనీస పాలసీ టర్మ్ 15 సంవత్సరాలు, గరిష్ట పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు.
మినిమం పాలసీ: కనీస పాలసీ 2లక్షల రూపాయలు తీసుకోవాలి గరిష్ట పాలసీ పరిమితి లేదు
ప్రీమియం చెల్లించే విధానం: ఈ పాలసీ ప్రీమియం ను మీరు సంవత్సరానికి,ఆరు నెలలకు ,ముడు నెలలకు, నెల వారి చొప్పున కూడా చెల్లించవచ్చును.
గ్రేస్ పీరియడ్ : ఈ పాలసీలో ప్రీమియం చెల్లించడానికి గ్రేస్ పీరియడ్ 30 రోజులు ఉంటుంది.
లోన్: ఈ పాలసీలో 2 సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించిన తరువాత మీకు పాలసీ మీద సరెండర్ విలువ ఆధారంగా లోన్ లభిస్తుంది.
సరెండర్ : కనీసం రెండు సంవత్సరాల పూర్తి ప్రీమియం చెల్లించిన తరువాత మీరు కావాలంటే పాలసీని సరెండర్ చేసుకోవచ్చు.
రివైవల్ : పాలసీ ప్రీమియం ను సకాలంలో చెల్లించక పోతే పాలసీ రద్దు అవుతుంది అటువంటి పాలసీలను 5 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకోవచ్చు .
తగ్గింపులు : ఈ పాలసీలో ఎల్ఐసి వారు రిబేట్ ఇస్తున్నారు, మీరు తీసుకున్న పాలసీ మరియు చెల్లించే ప్రీమియం మోడ్ ఆధారంగా ఈ రిబేట్ వస్తుంది అన్న విషయాన్నీ ఇక్కడ మీరు గమనించాలి.
మెచ్యూరిటీ ప్రయోజనం: పాలసీ కాలపరిమితి ముగిసిన తరువాత పాలసీ దారునికి తీసుకున్న SA లో 8% చొప్పున జీవించి ఉన్నంత కాలం సర్వైవల్ బెన్ ఫిట్ కింద చెల్లించడం జరుగుతుంది.పాలసిదారుడు ఒక వేళా మరణిస్తే నామినికి SA+BONUS చెల్లించడం జరుగుతుంది.
డెత్ బెనిఫిట్: పాలసీ కాల వ్యవధిలో పాలసీ అమలులో వుండి పాలసిదారుడు చనిపోతే మీరు ఎంచుకున్న బీమా మొత్తం లేదా వార్షిక ప్రీమియం కు 7 రెట్లు, లేదా చనిపోయే సమయానికి చెల్లించిన మొత్తం ప్రీమియంలలో 105% కంటే ఈ మూడింటిలో ఏది ఎక్కువ అయితే అది అప్పటి వరకు జమ అయిన బోనస్ తో నామినికి డెత్ బెన్ ఫిట్ కింద చెల్లించడం జరుగుతుంది.
ఈ పాలసీలో ఉన్న రైడర్స్: 1. ఎల్ఐసి యాక్సిడెంట్ బెన్ ఫిట్ రైడర్ 2. ఎల్ఐసి యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ 3. ఎల్ ఐ సి న్యూ టర్మ్ ఇన్సురెన్స్ రైడర్ 4. ఎల్ ఐ సి న్యూ క్రిటికల్ ఇన్సురెన్స్ రైడర్ 5.ఎల్ ఐ సి ప్రీమియం వైవర్ బెన్ ఫిట్
పన్ను ప్రయోజనాలు: చెల్లించిన ప్రీమియంలు మరియు ప్లాన్ కింద పొందిన ప్రయోజనాలు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C మరియు సెక్షన్ 10(10D) కింద పన్ను ప్రయోజనాలు వర్తిస్తాయి
మొత్తంమీద, ఎల్‌ఐసి యొక్క న్యూ జీవన్ ఉమంగ్ ప్లాన్ సాధారణ ఆదాయం మరియు పొదుపు భాగంతో లైఫ్ కవర్ కోసం చూస్తున్న వ్యక్తులకు మంచి ఎంపిక. పాలసీదారుడు దురదృష్టవశాత్తూ మరణించినప్పుడు పాలసీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది మరియు ప్రీమియం చెల్లింపు వ్యవధి తర్వాత పాలసీదారుకు సాధారణ ఆదాయాన్ని అందజేస్తుంది.
పాలసీ ప్రీమియం చెల్లింపు వ్యవధిలో సౌలభ్యాన్ని అందిస్తుంది మరియు హామీ ఇవ్వబడిన జోడింపులు, బోనస్‌లు మరియు పన్ను ప్రయోజనాలకు అర్హతను కలిగి ఉంటుంది. తమ కుటుంబ ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలనుకునే మరియు వారి పదవీ విరమణ సంవత్సరాలలో సాధారణ ఆదాయ ప్రవాహాన్ని పొందాలనుకునే వ్యక్తులకు ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.
Add New Comment